Monday, October 5, 2015

స్వామిహనుమ స్తోత్రాలు

శ్రీరామకార్యం నీ ఆశయం

శ్రీరామకధ నీ ఆయుధం

శ్రీరామగానం నీ ఆభరణం

శ్రీరామదూత, నీకు వందనం!!!

యుక్తిసహితభక్తి నీ స్వరూపము

ఆర్తితీర్చుశక్తి నీ స్వంతము

కీర్తిగల్గుఆస్తి నీ స్తోత్రము

ముక్తినొసగుమూర్తి నీ దైవము!!!

నిస్వార్ధానికి అర్ధం నువ్వు

రామభక్తికి అద్దం నువ్వు

అసురులపాలి అంతం నువ్వు

సజ్జనులకు శాంతం నువ్వు!!!

No comments:

Post a Comment